నవతెలంగాణ-కోట్పల్లి
పాము కాటుతో ఎద్దు మత్యుాత పడిన సంఘటన కోట్పల్లి మండల పరిధిలోని మోతుపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బాధిత రైతు కావలి బాలయ్య తెలిపిన వివరాల ప్రకారం పొలంలో వ్యవసాయం ముగించుకొని ఎద్దులను మేపుతున్న సమయంలో ఎద్దు పాము కాటుకు గురైనట్టు తెలిపారు. గమనించిన రైతు చికిత్స చేయించిన చివరికి మృత్యువాత పడిందని తెలిపారు. ఎద్దు విలువ దాదాపు రూ. 60వేలు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి బాధిత రైతు కుటుంబానని ఆదుకోవాలని కోరారు.