భవన నిర్మాణ మేస్త్రి మృతి ..

Construction maestro died..నవతెలంగాణ -దుబ్బాక 
జీవితం మీద విరక్తి చెందిన ఓ భవన నిర్మాణ మేస్త్రి మద్యంలో గడ్డి మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడగా.. అస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ వీ.గంగరాజు తెలిపిన వివరాలు…దుబ్బాక పట్టణ కేంద్రానికి చెందిన భవన నిర్మాణ మేస్త్రిగా పనిచేస్తున్న చింతల రామచంద్రం (70) భార్య,పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉన్న మద్యంలో గడ్డి మందు కలుపుకొని తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. విషయం భార్యకు చెప్పగా స్థానికుల సాయంతో 108 వాహనంలో సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించగా.. వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుని భార్య పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.