– హరీశ్ రావు సంతాపం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాజీ చైర్మెన్ డాక్టర్ ఎన్.సుధాకర్ రావు బుధవారం సాయంత్రం మరణించారు. ప్రముఖ వైద్యులు సుధాకర్ రావు మూత్రపిండ సమస్యతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించింది. ఆయన్ను వెంటనే ఐసీయూకి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు.
సంతాపం
మాజీ శాసన సభ్యులు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాజీ చైర్మెన్ డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్‌రావు మరణం బాధాకరమంటూ మాజీ మంత్రి హరీశ్ రావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.