సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు ‘మాదాల’ మృతి

– రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళి
నవతెలంగాణ -కూసుమంచి
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు మాదాల కనకయ్య మంగళవారం గుండె పోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం కనకయ్య భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనకయ్య మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. నివాళి అర్పించిన వారిలో.. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్‌, మండల కార్యదర్శి వర్గ సభ్యులు తోటకూరి రాజశేఖర్‌, మాజీ సర్పంచ్‌ తాళ్ళూరి రవి, మండల కమిటీ సభ్యులు తాళ్ళూరి వెంకటేశ్వరరావు, బిక్కసాని గంగాధర్‌, చీర్ల రాధా కృష్ణ, పార్టీ సభ్యులు ఉన్నారు.