నవతెలంగాణ – మునుగోడు
విద్యార్థి హక్కుల సాధన కోసం ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి యాసరాణి శివ చేసిన కృషి మరువలేనిదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. మంగళవారం అకాల మరణం చెందిన శివకు బుధవారం భౌతికానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశనుండే విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై అనేక ఉద్యమాలు నిర్వహించి విద్య రంగ సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేపట్టారని విద్యార్థి ఉద్యమ నాయకుడు శివ అని కొనియాడారు. మండలంలోని పలు సమస్యలపై ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేపట్టిన ఉద్యమాలలో శివ కీలక పాత్ర పోషించే వారిని గుర్తు చేశారు. ఆయన మృతి విద్యార్థి ఉద్యమాలకు తీరని లోటు అని అన్నారు. వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని అన్నారు. ఆ కుటుంబానికి సీపీఐ(ఎం) పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి లు మిర్యాల భరత్, జేరిపోతుల ధనంజయ్య, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ , మండల కమిటీ సభ్యులు యాస రాణి శ్రీను, వేముల లింగస్వామి, సాగర్ల మల్లేష్, మిర్యాల భరత్, యాట యాదయ్య , డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కట్టా లింగస్వామి, యాటరాజు, యాట గణేష్ , శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.