– కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
– రెడ్లకుంట లిఫ్ట్ట్ ఇరిగేషన్‌తో బీడు భూములు సస్యశ్యామలం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-కోదాడరూరల్
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అప్పుల భారాన్ని 10రెట్లు పెంచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని రెడ్లకుంట గ్రామంలో రూ.47.54 కోట్లతో ఏర్పాటు చేయనున్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, రూ.5.30 కోట్లతో ఉత్తమ్ పద్మావతి శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పునరుద్ధరణ కార్యక్రమాలకు మంత్రులు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా శాంతినగర్, రెడ్లకుంట్ల గ్రామాల్లో పదివేల ఎకరాల వరకు పంటలు సాగు చేసే అవకాశం ఉందని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందన్నారు. ఆయకట్టు చివరి భూములకు సాగు నీరందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 మంది నిరుపేదలకు గృహలకిë పథకం ద్వారా ఇండ్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షలు అందివ్వనున్నట్టు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మార్చి ఒకటో తేదీ నుంచి తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. కోదాడలో పట్టణంలో రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, పాండు రంగారావు, యెర్నేని బాబు, రామారావు, పార సీతయ్య, సాధినేని అప్పారావు, గంగావరపు లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.