కాటేపల్లిలో రుణ మాఫీ సంబరాలు

Debt waiver celebrations in Katepallyనవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని కాటే పల్లి గ్రామంలోశుక్రవారం నాడు కాంగ్రేస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రైతు రుణ మాఫీ సంబరాలు నిర్వహించారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జుక్కల్ శాసన సభ్యులు తోట లక్ష్మి కాంత్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మల్లప్ప పటేల్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణ మాఫీ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అంతే కాకుండా గత బి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు రుణ మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్ విడతల వారి రుణ మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసారే తప్ప మాపి చేసిన సందర్భలు లేవని ఎద్దవా చేశారు. కాంగ్రేస్ పార్టీ రైతుల ప్రభుత్వం అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి  అందించడం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులకు  రుణ మాఫీ  చెయ్యడం అది  ఒక్క కాంగ్రేస్ పార్టీ సాధ్యమని ఆయన మాట్లాడుతూ అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లప్ప పటేల్,మొయినిద్దిన్ పటేల్,మొగుల గౌడ్,గంగా గౌడ్,హన్మాండ్లు,సాయిలు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.