
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు ఇచ్చిన హామీ ప్రకారం గురువారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి దఫా లక్ష లోపు రుణ రైతులకు నిధుల విడుదల వీడియో కాన్ఫరెన్స్ సంభాషణ కార్యక్రమాన్ని మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రుణమాఫీ సంబరాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్థానిక ఏఈఓ ప్రియాంక ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ అధికారులతో పాటు మండల వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.