బ్యానర్ పై ఫోటోల వివాదం మండలంలోని రైతు వేదికలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ సంబరాలను నిర్వహించారు. రైతు వేదికలో స్క్రీన్ పైన రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరులు ప్రసంగించే ప్రసంగాన్ని వీక్షించడానికి వీలుగా రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. మండలం ఎల్లారెడ్డి తోపాటు కామారెడ్డి నియోజకవర్గం ఉండడంతో రైతు వేదికలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఫోటో ఏర్పాటు చేయలేదని సభలో కొద్దిసేపు వివాదం ఏర్పడింది. అనంతరం ఒకరికొకరు మాట్లాడుకొని వివాదాన్ని సద్దు మానుచారు.మండలంలో 1101 మందికి రుణమాఫీ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.