మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో గురువారం రుణమాఫీ సంబరాలను నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రుణ మాఫీని లాంచనంగా ప్రారంభించే దృశ్యాలను అధికారులు, మండల రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా మండలంలో మొదటి విడతలోనే 1270 మంది రైతులకు పంట రుణమాఫీ జరగడంతో రైతులు సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్, తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో చింతరాజ శ్రీనివాస్, ఏఈఓ లు రమేష్, సాయిరాం, పద్మ, లబ్ధి పొందిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.