దేవలమ్మ నాగారంలో రుణమాఫీ సంబరాలు

Debt waiver celebrations in Devalamma Nagar– సీఎం రేవంత్ రెడ్,డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం
నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగా ఏకకాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వంగా నిరూపించుకున్నారని దేవలమ్మ నాగారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జక్క సుధాకర్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ సంబరాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా జక్క సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన 8 నెలల్లోనే రైతు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకుందన్నారు. ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 11.42లక్షల ఉంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతమన్నారు. రైతు రుణమాఫీతో గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. రాబోయే రోజుల్లో పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు సురుగు శ్రీనివాస్,వరకాంతం జంగారెడ్డి,సురుగు మల్లేష్,బొమ్మ మైసయ్య, రాసాల జంగయ్య,ఆదిమూలం శ్రీనివాస్, పన్నాల రాజిరెడ్డి,బొమ్మ తిరుమల్,బిట్టి రాము,బొమ్మ రాములు,బొమ్మ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.