
నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో గురువారం రోజు రుణమాఫీ సంబరాలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో గల రెవెన్యూ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రవు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం రెవెన్యూ కార్యాలయం నుండి రైతు వేదిక వరకు పాదయాత్ర నిర్వహించి రైతు వేదికలో రైతు సమావేశం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో పాల్గొని రైతు సంబరలను జరుపుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, నాగిరెడ్డిపేట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాసురెడ్డి, మాజీ సర్పంచ్ విఠల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దివిటి కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ ఠాగూర్, మైనారిటీ అధ్యక్షులు ఇమామ్, కో ఆప్షన్ సభ్యులు షాహిద్ పాషా, గులామ్ హుస్సేన్, పర్వత రావు, బాల్డ్డి, శ్రీరామ్ గౌడ్, సాయ గౌడ్, మధు, కలీం, తదితరులు పాల్గొన్నారు.