గ్రామాలలో రుణమాఫీ సంబరాలు

నవతెలంగాణ-భిక్కనూర్
సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చిత్రపటానికి మండలంలోని రామేశ్వర పల్లి తిప్పాపూర్, అంతంపల్లి, గ్రామాల్లో గల సహకార సంఘం పాలకవర్గం ఆధ్వర్యంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసినందుకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సొసైటీ అధ్యక్షులు, భూమి రెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకట్ రెడ్డి  ఇస్సన్నపల్లి సర్పంచ్ రాములు, వైస్ ఎంపీపీ యాదగిరి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సాయి రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్ లు, సహకార సంఘాల ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.