– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
రైతులు పహాని నకల్ పై తీసుకున్న వ్యవసాయ రుణాలకు ప్రభుత్వ రుణమాఫీ వర్తింపజేయాలని సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపజేయాలని పహాని నకల్ పై తీసుకున్న రుణాలకు ఇది వర్తింపజేయాలని రుణమాఫీపై ప్రభుత్వ విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశించి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రతి రైతుకు రెండు లక్షలు మాఫీ చేస్తారని నేడు ప్రతి కుటుంబానికి రెండు లక్షల మాఫీ చేస్తారని అంతకంటే ఎక్కువ ఉంటే రైతు మొదలు జమ చేయాలని నిబంధన పెట్టి రెండు లక్షలకు పైబడిన వారి అప్పులు రద్దు చేయకుండా దాటవేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. అంతేకాకుండా ఏజెన్సీలో పట్టాదారి పాసుపుస్తకాలు లేకుండా పహాని నకల్ పై అనేక మంది రైతులు రుణాలు తీసుకున్నారని వారి వీరికి రైతు రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం బేషరతుగా మొదలు బ్యాంకులో రైతు రుణమాఫీ జమ చేయాలని అలా కాకుండా వడ్డీలు కట్టుకోమని రేషన్ కార్డు లేవని, పట్టాదారు పాస్ పుస్తకాలు లేవని, అనేక కొరీలు పెట్టి నేడు అర్హులైన రైతుల రుణాలు మాఫీ కాకుండా ప్రభుత్వ నిబంధనలు అడ్డుగా ఉన్నాయని వెంటనే వీటిని సడ లించాలని డిమాండ్ చేశారు .లేనియెడల అనంతరం భవిష్యత్తులో పెద్ద ఎత్తున రైతుల సమీకరించి ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం తాహశీల్దార్ సృజన్ కుమార్ కు వినతిపత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి తీగల ఆదిరెడ్డి మండల కమిటీ సభ్యులు సోమ మల్లారెడ్డి, గుండు రామస్వామి, గొంది రాజేష్, నాయకులు కట్ట వెంకటేశ్వర్ రావు, సోలిపురం రాజు, నిమ్మల బిక్షం, గుండు లెనిన్, తుంగపాటి సోమయ్య, ఎండి రబ్బాని, శ్రీను, మంచాల కవిత, అశోక్ తదితరులు పాల్గొన్నారు.