దశాబ్ది ఉత్సావాలు శతాబ్దాలు నిలిచి పోవాలి

– తొమ్మిదేళ్ల ప్రగతి వర్తమానానికి చేరాలి
– సంబురాలలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి
– తలసరి ఆదాయంలో తెలంగాణా టాప్‌
– మంత్రి జగదీశ్‌ రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది వేడుకలు శతబ్దా కాలంగా ప్రజల మదిలో నిలిచి పోయేలా జరుగుతాయని రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి వెల్లడించారు.అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన ప్రకటించారు.ఈ నెల 2 నుండి నిర్వహించ నున్న దశాబ్ది ఉత్సావాల ఏర్పాట్ల పై గురువారం స్థానిక సదాశివరెడ్డి పంక్షన్‌ హల్‌ లో నిర్వహించిన నియోజక వర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.తొమ్మిది ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతత్వంలో జరిగిన పురోగతి వర్తమానానికి మార్గ దర్శనం అయ్యేలా ఉత్సవాలు ఉంటాయని పేర్కొన్నారు. సంబరాలలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకున్న లబ్దిదారులతో పాటు ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు ఇదొక ఉత్సవ శోభ ను కలిగిస్తుందన్నారు.సంక్రాంతి ని మరిపించేలా రైతులు ఈ సంబరాలలో పాల్గొనేలా చూడాలని ఆయన కోరారు. కాళేశ్వరం జలాల తొలి ఫలం అందుకున్నది సూర్యాపేట జిల్లా యే అని తద్వారా సూర్యాపేట నియోజక వర్గం లో ఇప్పుడు త్రివేణి సంగమం ఏర్పడిందని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాధించిన ఘనత ఇది అని కొనియాడారు. ఆధునిక దేవాలయలుగా రైతు వేదికలు వర్ధిల్లుతాయని చెప్పారు. తలసరి ఆదాయంలో తెలంగాణా టాప్‌ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్‌ ,జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌, అడిషనల్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకట్‌ నారాయణ గౌడ్‌, గ్రంధాలయ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌ గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పెరుమాల అన్నపూర్ణ, వైస్‌ చైర్మన్‌ పుట్టా కిషోర్‌, సూర్యాపేట ఎంపిపి , జడ్పీటిసి లు రవీందర్‌ రెడ్డి, జీడి బిక్షం, పెన్‌ పహాడ్‌ ఎంపిపి, జడ్పీటిసి లు నెమ్మాది బిక్షం, మామిడి అనిత అంజయ్య,ఆత్మకూర్‌ ఎంపిపి మర్ల స్వర్నలత చంద్రారెడ్డి, పట్టణ కౌన్సిలర్లు,తదితరులు పాల్గొన్నారు.