మోసపోయింది ఇకచాలు…

మోసపోయింది చాలు…
మోసపోయింది ఇక చాలు..
ఇకనైనా నీకోసం ఓటెరు..
నీ వారికోసం ఓటెరు..
ఈ దేశం బాగుకోసం ఓటెరు..
ప్రజల రక్షణకోసం ఓటెరు..
ఉద్యోగాలు నింపేవాడికి ఓటెరు..
ఉపాధి కల్పించేవాడికి ఓటెరు…
ఆకలి తీర్చేవాడికి ఓటెరు..
పేదరికం తగ్గించేవాడికి ఓటెరు…
రైతులకు భరోసానిచ్చేవాడికి ఓటెరు..
కార్మికులను కాపాడేవాడికి ఓటెరు..
ఏం చేశారో, ఏం చేయబోతున్నారో
నిజాయితీగా చెప్పేవారికి ఓటెరు…
అబద్ధాలతో అధికారాన్ని నిలుపుకోవాలని
చూసేవాడిని ఓటుతో తోసెరు..
అధికారం రాకపోయినా సరే నిజాయితీగా
ప్రజల పక్షాన నిలబడేవారిని తెచ్చెరు..
మతం పేరుతో దేవుడిని బూచిగా చూపి
ఓట్లడిగేవాడిని కిందపడెరు..
అభివృద్ధి మేనిఫెస్టో చూపినవాడిని
అందలమెక్కించెరు..
ఆడపిల్లలను నగంగా ఊరేగిస్తూ,
అత్యాచారాలు చేస్తున్నా..
దోషులను శిక్షించాల్సిందిపోయి,
రక్షణగా నిలుస్తున్నవాడిని ఓడించెరు..
ఆడపిల్లలకు, మహిళలకు రక్షించి
ఆలంబన ఇచ్చేవారిని గెలిపించెరు..
పౌరహక్కులు, స్వేచ్ఛ, సమానత్వం,
సౌభ్రాతృత్వాలను పెంపొందించే
రాజ్యాంగాన్ని భక్షించాలని చూస్తున్న
గుంటనక్కలను గుంజెరు..
రాజ్యాంగ రక్షణకై కలబడతామని,
నిలబడతమనే ప్రజాహితులను తీసుకొచ్చెరు..
ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేస్తూ,
అధికార దుర్వినియోగం చేస్తూ,
కార్పోరేట్లకు లక్షలకోట్ల రుణాలు మాఫీ చేస్తూ,
ప్రయివేటీకరణను ప్రోత్సాహించేవాడిని దించెరు..
ప్రభుత్వరంగ సంస్థలను కాపాడే
ప్రజాస్వామ్యవాదులను కుర్చీ ఎక్కించెరు..
సమయం లేదు..
మళ్లీ ఐదేండ్లదాక అవకాశం రాదు..
ఇకనైనా నీకోసం ఓటెరు..
నీ వారి కోసం ఓటెరు..
ఈ దేశం బాగుకోసం ఓటెరు..
ప్రజల రక్షణకోసం ఓటెరు..
మోసపోయింది చాలు…
మోసపోయింది ఇకచాలు..
– అవని