డిసెంబర్ 1 మాలల సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ 

December 1 Malala Simha Garjana poster unveilingనవతెలంగాణ – కంఠేశ్వర్

డిసెంబర్ 1న హైదరాబాదులో జరుగనున్న మాలల సింహగర్జన వాల్పోస్టర్లను శనివారం నగరంలోని ఆర్అండ్ బి గెస్ట్ హౌస్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ గైని గంగారాం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలల సింహగర్జనకు జిల్లాలోని మాలలు అదరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమితి కో-కన్వీనర్లు నీరడి లక్ష్మణ్, కేశ్పల్లి రవి, సుంకరి మోహన్, పులి జైపాల్, అనంత్, కామారెడ్డి కన్వీనర్ బంగారు సాయిలు, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు సక్కి విజయ్కుమార్, ప్రధాన కార్యదర్శి సిద్ధం రాజేందర్ పాల్గొన్నారు.