పెన్షన్ అనేది ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రోజును దేశవ్యాప్తంగా పెన్షనర్స్ డే నిర్వహించుకుంటున్నారు. దానిలో భాగంగానే నిజామాబాదులో ఈ నెల 19వ తేదీన న్యూ అంబేద్కర్ భవన్ లో పెన్షనర్స్ డే ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కే. రామ్మోహన్రావు ప్రధాన కార్యదర్శి మధుసూదన్ కోశాధికారి ఈవిల్ నారాయణ గురువారం తెలిపారు. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర సాధన రథసారథ ప్రొఫెసర్ కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు రాష్ట్ర నాయకులు, జిల్లా అధికారులు అతిధులుగా హాజరవుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.