నాగర్ కర్నూల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ప్రభుత్వ నిర్ణయం 

Decision of Govt to Nagar Kurnool Urban Development Authority– కోట్ల రూపాయలతో ఉమామహేశ్వరం అభివృద్ధి  విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ
నవతలంగాణ – అచ్చంపేట
నాగర్ కర్నూల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా ప్రజలందరూ సహకరించాలని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటులో కీలక ఘట్టం ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా 20 మండలాల్లో 18 మండలాలకు సంబంధించి 319 గ్రామాలను నాగర్ కర్నూల్ అర్బన్ గవర్నమెంట్ అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ సూచించారు. కొన్ని ఏజెన్సీ గ్రామపంచాయతీలను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అచ్చంపేట మండలంలో 14 గ్రామ పంచాయతీలు, వంగూరు మండలంలో 19 , చారకొండ లో ఏడు బలమూరులో 17 లింగాలలో ఉప్పునుంతల లో 23 గ్రామపంచాయతీలు కూడా మొత్తం 319 గ్రామాలను నాగర్ కర్నూల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మండలంలోని ప్రసిద్ధిగాంచిన ఉమామహేశ్వరం క్షేత్రాన్ని అన్ని విధాల అధునాతన అభివృద్ధి చేనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

నూతన కళ్యాణ మండపం 50 లక్షలు, పంచలింగాల అభివృద్ధికి 50 లక్షలు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. రంగాపూర్ నుంచి ఉమామహేశ్వర వరకు 15 కోట్లతో డబుల్ రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. టూరిజం శాఖ అభివృద్ధితో పర్యాటకుల వసతి సౌకర్యాలు కల్పించడానికి మరిన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. రూప్ కార్ 10 కోట్ల ప్రతిపాదన ప్రభుత్వానికి నివేదిక పంపించినట్లు వెల్లడించారు. జనవరి చివరి నాటికి ఈ అభివృద్ధి పనులు చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎక్కడినుంచి అయినా ఉమామహేశ్వరం దర్శనం కోసం ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. నిత్యం 1500 మంది అన్నదానం చేసే విధంగా అదేవిధంగా రాత్రి బస చేసే పర్యాటకు భక్తులకు భోజన ఏర్పాట్లకు కృషి చేస్తామన్నారు. ఉమామహేశ్వరం అభివృద్ధికి దాతలు సహకరించాలని, వారి పేర్లను నోటీసు బోర్డు పైన పెట్టడం జరుగుతుందన్నారు. ఉమామహేశ్వరం దేవస్థానం నూతన కమిటీ పాలకవర్గం భక్తుల సౌకర్యాలు అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడిన దేవాలయం ని ఎలాంటి డిస్మెంటల్ చేయకుండా ప్రజలకు, భక్తులకు, పర్యాటకులకు అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి చేయనున్నారు. నవంబర్ 3 నుంచి 12 తారీకు వరకు నేత్రాలయం వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని నియోజకవర్గాల్లోని ప్రజలందరూ చేసుకోవాలన్నారు. కంటిలో ఎలాంటి సమస్య ఉన్న వారిని మద్రాస్ తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి ఇంటికి పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందన్నారు. కార్యక్రమంలో ఉమామహేశ్వరం దేవస్థాన కమిటీ చైర్మన్ మాధవరెడ్డి , మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ రెడ్డి, అంతటి మల్లేష్, తదితరులు ఉన్నారు.