భారత రత్న ప్రకటించడం దేశానికి గర్వకారణం

నవతెలంగాణ -నంగునూరు
మాజీ ఉప ప్రధాని లాల్‌ కష్ణ అద్వానీకి భారత రత్న ప్రకటించడం దేశానికి గర్వకారణమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్‌.విద్యాసాగర్‌ పేర్కొన్నారు. శనివారం కేంద్ర పార్టీ పిలుపు మేరకు నంగునూరు మండలం మగ్దుంపూర్‌ గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు బెదురు కుమారస్వామి అధ్యక్షతన ఘావ్‌ చలో అభియాన్‌ కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన పథకాల గురించి పేదలకు వివరించి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. మెదక్‌ ఎంపీ స్థానంలో విజయం సాధించి మోదీకి కానుక ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వాసర యాదమల్లు, మల్యాల రాజు, గట్టు రవి, బండి సతీష్‌, గోవిందారం నారాయణ, మంత్రి కొమురయ్య, బెండల రాజలింగం, కష్ణ, సంపత్‌, స్వామి, తిరుపతి, కిషోర్‌, అనిల్‌, ప్రశాంత్‌, ప్రతాప్‌ రెడ్డి, గిరి తదితరులు పాల్గొన్నారు.