పిడుగుపాటుకు కాడెద్దులు మృతి

Deddulu died due to lightningనవతెలంగాణ – రాయపోల్
ప్రకృతి వైపరీత్యాల వలన తీవ్ర నష్టం వాటిల్లడం జరుగుతుంది. ప్రకృతికి ఎవరు అతీతులు కానప్పటికి ఆదివారం పిడుగుపాటుకు ఇద్దరు రైతులకు చెందిన రెండు కాడెద్దులు మృతి చెందిన విషాదకరం. గత నాలుగు ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షాలకు దౌల్తాబాద్ మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామనికి చెందిన మద్దెల సుధాకర్ అనే రైతు యెక్క ఎద్దు పిడుగుపాటుకు మృత్యువాత పడింది. ప్రతి రోజు మాదిరిగానే వ్యవసాయ పనులు పూర్తిచేసుకుని తన వ్యవసాయ పొలం వద్దనే ఎడ్లను పశువుల కొట్టంలో కట్టేసి రావడం జరిగింది. తిరిగి మళ్లీ ఉదయం వ్యవసాయ పనుల కోసం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన రైతు అకస్మాత్తుగా పిడుగు పడి మరణించిన ఎద్దును చూసి తట్టుకోలేక కన్నీరు మున్నిరయ్యారు. అలాగే దౌల్తాబాద్ మండలం లింగాయపల్లి తాండకు చెందిన గగులోత్ లలిత- పీర్య దంపతులు వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. గ్రామ సమీపంలో వారి వ్యవసాయ పొలంలో ఉన్న పశువుల పాకపై పిడుగు పడటంతో వారి ఎద్దు కూడా అక్కడికక్కడే మృతి చెందింది. దానితో ఓకే ఎద్దుతో వ్యవసాయం ఎలా చేసేది అంటూ బోరున విలపించారు. వ్యవసాయం చేయాలంటే ముఖ్యంగా ఎడ్లు ఎంతో అవసరమని అలాంటి ఎడ్లు ప్రకృతి వైపరీత్యం వల్ల పిడుగుపడి ఎడ్లు మృతి చెందడం వలన ఆ రైతు కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒక్కొక్క రైతు కుటుంబం సుమారు రూ.60 వేల చొప్పున నష్టపోవడం జరిగింది. కాబట్టి ఆ రైతు కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.