డల్లాస్‌లో స్థిరపడిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గోపీ కష్ణ కొటారు, శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. మొదటి ప్రయత్నంగా తన కుమార్తె శ్రీజ కొటారు పాడి, నటించిన ‘స్వప్నాల నావ’ వీడియో చిత్రీకరణను ప్రారంభించారు. గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్య స్మతికి అంకితంగా రూపొందిస్తున్న ఈ పాటని ఓ.ఎమ్.జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత మీనాక్షి అనిపిండి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ పాటకు పార్ధసారధి నేమాని స్వరాలు సమకూర్చగా, యశ్వంత్ సాహిత్యం అందజేశారు. దర్శకుడు వీ.ఎన్. ఆదిత్య చిత్రీకరణ చేశారు. ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన భావజాలం ప్రతి ఒక్కరి హదయాలను తాకుతుంది. ఆయనే ఉండి ఉంటే యువతరానికి తన సాహిత్యం ద్వారా ఎలాంటి సందేశం ఇస్తారన్న ఆలోచనలో నుంచే ‘స్వప్నాల నావ’ పాట చేయాలనే భావన కలిగింది’ అని గోపీకష్ణ తెలిపారు. పార్ధసారథి నేమాని మాట్లాడుతూ,’సిరివెన్నెల లాంటి గొప్ప వ్యక్తి ఇచ్చిన సాహిత్యాన్ని ప్రేరణగా తీసుకుని పిల్లల కోసం ఈ పాట చేశాం’ అని చెప్పారు. ‘శ్రీజ ప్రతిభ, గాత్రం చూస్తే ప్రొఫెషనల్ సింగర్‌గా అనిపించింది. పాటను వీలైనంత త్వరగా చిత్రీకరణ జరిపి మీ ముందుకు తీసుకొస్తాం’ అని దర్శకుడు వీఎన్ ఆదిత్య తెలిపారు.