
ముధోల్ నుండి వాటోలి వరకు రూ.30కోట్లతో నిర్మిస్తున్న డబుల్ రోడ్డు పనులను భైంసా డివిజన్ ఆర్ అండ్ బి డిఈఈ సునీల్ కుమార్ బుధవారం పరిశీలించారు. నిర్మిస్తున్న రోడ్డుకు కొలతలు చెప్పట్టారు. రోడ్డుపై అక్కడక్కడ నిర్మిస్తున్న కల్వర్టు లను పరిశీలించారు. రోడ్డు పనులు మరింత వేగాన్ని పెంచి వాహన దారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోడ్డు పనులను నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.