కాంగ్రెస్‌లో ముదురుతున్నగ్రూపు రాజకీయాలు

– పాల్వాయి స్రవంతి, చలమల కష్ణారెడ్డి పోటాపోటీగా క్యాంప్‌ ఆఫీసులు ప్రారంభం
– అయో మయానికి గురవుతున్న కార్యకర్తలు
నవతెలంగాణ-సంస్థాన్‌ నారాయణపురం
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ నియోజకవర్గాల్లో నెలకొన్న గ్రూపులను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైందనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.గ్రామ మండల కమిటీ నియామకాల్లో ఏకపక్షంగా వ్యవహరించాలని ఒకరు..స్వార్థం కోసం రాజకీయం చేస్తున్నారని మరొకరు.. విమర్శలు ప్రతి విమర్శలతో మునుగోడు కాంగ్రెస్‌ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారు. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి మరణానంతరం మునుగోడు కాంగ్రెస్‌ లో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీలో పిసిసి కార్యదర్శి చలమల కష్ణారెడ్డి,మాజీ ఏఐసిసి సభ్యురాలు పాల్వాయి స్రవంతి, గ్రూపు రాజకీయాలు నివురుగప్పిన నిప్పుల రాజు కుంటూనే ఉన్నాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మునుగోడు ఉప ఎన్నికకు ముందు నుంచి చలమల కష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి,పున్న కైలాస్‌ నేత మధ్య గ్రూపు రాజకీయాలు రావణ కష్టంలా రగులుతూనే ఉన్నాయనీ కార్యకర్తలు అంటున్నారు.తాజాగా పాల్వాయి స్రవంతి,పున్న కైలాస్‌ నేత, ఒక వర్గంగాను చెలమల్ల కష్ణారెడ్డిని మరో వర్గంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. చలమల్ల కష్ణారెడ్డి మునుగోడు అభ్యర్థిని నేనే అంటూ ప్రకటన చేసుకొని ఆ దిశగా మండల గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు చేపడుతున్నారు. జూన్‌ 8న మునుగోడు మండల కేంద్రంలో క్యాంప్‌ ఆఫీసు సైతం ప్రారంభించారు.ప్రచార రథాలను సైతం సిద్ధం చేసుకున్నారు.నాంపల్లి మండలంలో ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించిన ఆయన 100 గ్రామాల వరకు పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. తాజాగా మునుగోడు మండల కేంద్రంలో పాల్గొనే పాల్వాయి స్రవంతి పునకైలాస్‌ నేతలు మరో క్యాంప్‌ ఆఫీసును ప్రారంభించారు.ఎట్టి పరిస్థితుల్లో మునుగోడులో పోటీ చేసి తీరుతామంటూ తెగేసి చెప్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో పాల్వాయి స్రవంతి, చలమల కష్ణారెడ్డి,పన్న కైలాస్‌ నేత,తో పాటు మరో మైనార్టీ నాయకుడు అక్బర్‌ ఉన్నారు.పాల్వాయి స్రవంతికి గాని పున్న కైలాస్‌ నేత కు గాని ఇద్దరిలో ఎవరికి అధిష్టానం బీఫామ్‌ ఇచ్చిన అభ్యర్థి గెలుపు కోసం ఇద్దరం కలిసే పని చేస్తామని కార్యకర్తలతో చెప్తున్నట్టు తెలుస్తుంది.మాకు కాకుండా చలమల కష్ణారెడ్డికి బీఫామ్‌ ఇస్తే ఓడించి తీరుతామని బహిరంగంగానే చెప్తున్నట్లు కార్యకర్తలు అంటున్నారు.గ్రామ, మండల కమిటీ నియామకాల్లో చలమల కష్ణారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ తన అనుచరులకు మాత్రమే పదవులు కట్టబెట్టారని పాల్వాయి స్రవంతి,పున్న కైలాస్‌ నేతలు బహిరంగంగానే విమర్శించిన సంగతి పాటకులకు వివిధమే.దీంతో చలమల్ల వర్గీయులు స్వార్థం కోసం పాల్వాయి స్రవంతి రాజకీయం చేస్తుందంటూ విలేకరుల సమావేశంలో ప్రతి విమర్శలు చేశారు.పాల్వాయి స్రవంతినే విమర్శిస్తావా అంటూ పున్న కైలాస్‌ మునుగోడు మండల కేంద్రంలో చలమల కష్ణారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో చెల్లమల్ల కష్ణారెడ్డి కైలాస్‌ నేత వర్గాల మధ్య తీవ్ర రభస జరిగింది.పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం పాల్వాయి స్రవంతి వర్గీయులు విలేకరుల సమావేశం పెట్టి చలమల కష్ణారెడ్డి ప్రవర్తన మార్చుకో అంటూ హెచ్చరిక చేశారు.చలమల కష్ణారెడ్డి పాల్వాయి స్రవంతి గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మునుగోడు కాంగ్రెస్‌ లో ఇంత జరుగుతున్న అధిష్టానం పట్టించుకోకపోవడం కారణంగానే గ్రూప్‌ రాజకీయాలు నివురుగప్పిన నిప్పుల రగులుతూనే ఉన్నాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పార్టీ నిర్ణయించిన వ్యక్తులకు కాకుండా వ్యతిరేకంగా పనిచేసే వారిపై రాజకీయంగా వేటు వేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.నాయకులారా మీ గ్రూపు గోలలు పక్కన పెట్టి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేయండి అంటూ కార్యకర్తలు వేడుకుంటున్నారు.గ్రూపు రాజకీయాలతో కాంగ్రెస్‌ కు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.