
ఆసియా ఖండాల్లోనే అతిపెద్ద అదివాసి గిరిజన జాతరైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలోని సమ్మక్క పూజారి సిద్దబోయిన దశరథం మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మేడారంలో విషాదచాయలు అలుముకున్నాయి. గత పది నెలల క్రితం సిద్దబోయిన దశరథం అన్న సమ్మక్క పూజారి సిద్దబోయిన లక్ష్మాణరావు అనారోగ్యంతో మృతి చెందడంతో సిద్ధబోయిన వంశస్తుల కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. కాగా దశరథం మృతి పట్ల దేవదాయ శాఖ మంత్రి సురేఖ, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క లు సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.