ఎస్ ఎఫ్ ఐ నూతన జిల్లా అధ్యక్షురాలిగా దీపికను ఎన్నుకున్నారు. ఈ మేరకు మంగళవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) నిజామాబాద్ స్థానిక ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో నూతన జిల్లా అధ్యక్షురాలిగా దీపిక ఎన్నిక కావడం జరిగింది. భవిష్యత్తులో విద్యారంగంలో మహిళలలు ఎదుర్కొనే సమస్యలపై అలుపెరగాని పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు రూపకల్పన చేస్తున్న అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ కమిటీ నాపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించినందున ధన్యవాదములు తెలియజేశారు.