జింక పిల్లను అటవీ శాఖ అధికారులకు అప్పగింత..

నవతెలంగాణ- రెంజల్

రెంజల్ మండలం నీల గ్రామ శివారులలో సర్పంచ్ లలితా రాఘవేందర్ పొలంలో వరి కోత కోపిస్తున్న సందర్భంగా జింక పిల్ల దొరకడంతో దానిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అటవీ శాఖ కానిస్టేబుల్ జయరాజ్, టీ .నవీన్ లు శనివారం 11 గంటలకు దానిని తిరిగి అదే చోట వదిలివేయడానికి వెళ్లారు. జింక పిల్లకు నిప్పల్ సహాయంతో అధికారులు పాలను తాగించారు. ఈ జింక పిల్లను అదే జాతికి చెందిన గుంపులో వదిలితే తప్ప అడవిలో వదిలితే అది చనిపోతుందని వారు పేర్కొన్నారు. సర్పంచ్ లలిత రాఘవేందర్ పొలం పక్కనే వదిలివేయడానికి గ్రామ రైతు సహాయంతో అక్కడికి వెళ్లారు. వారి వెంట గ్రామ కార్యదర్శి బి. రాణి, కారోబర్ రమేష్, తదితరులు ఉన్నారు.