
నవతెలంగాణ – కామారెడ్డి
డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లు ఈనెల 27వ తేదీ లోగా నగదు లేదా బియ్యం రూపంలో చెల్లించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మిల్లర్లను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం 2021-22,2022-23 ఖరీఫ్ డిఫాల్ట్ రైస్ మిల్లర్లతో సీఎంఆర్ పెండింగ్ బకాయిలపై సమావేశం నిర్వహించారు. డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లు చెల్లించకపోతే ఈనెల 27 తేదీ తర్వాత వడ్డీతో నగదు చెల్లించడానికి అనుమతించబడుతారని చెప్పారు. బకాయిలు చెల్లించడంలో విఫలమైతే వారిపై ఆర్ఆర్ చట్టం ప్రయోగిస్తామని డిఫాల్ట్ మిల్లర్స్ ను అదనపు కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున బాబు, మిల్లుల యజమానులు పాల్గొన్నారు.