నవతెలంగాణ – మోపాల్
బుధవారం రోజున మోపాల్ మండల కేంద్రంలో న్యూ డెమోక్రసీ నాయకులు వేల్పూర్ భూమయ్య పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ మతోన్మాద పార్టీని ఓడించండి లౌకిక పార్టీలను బలపరచండి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య అన్నారు. తేదీ 26 4 2024న మోపాల్ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ.. బీజేపీ మోడీ ప్రభుత్వం గత 15లుగా ఈ దేశాన్ని వనరులను తన ఆశ్రిత పెట్టుబడిదారులైన ఆదా అని అంబానీలకు కట్టబెడుతున్నారని ఆయన అన్నారు. హిందూ ముస్లిం మధ్య మతం పేరుతో రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. కార్మిక రైతు వ్యతిరేక మోడీ ప్రభుత్వాన్ని ఓడించండి రాజ్యాంగాన్ని రక్షించండి అని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో తేదీ 23 4 2024 నా జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఈ సభకు ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి కృష్ణ ప్రసాద్ సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు జేవి చలపతిరావు హాజరవుతారని భూమయ్య తెలిపారు. ఈ సభను విజయవంతం చేయడానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎర్రన్న ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు బండమీద నరసయ్య ఏఐకేఎంఎస్ నాయకులు అగ్గు చిన్నయ్య పి వై ఎల్ నాయకులు విజేందర్ గంగాధర్ రైతు నాయకులు గంగారం తదితరులు పాల్గొన్నారు.