– ఉత్తరాఖాండ్ గెలుపు
డెహ్రాడూన్ : రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌కు వరుసగా రెండో మ్యాచ్‌లో పరాజయం ఎదురైంది. గత సీజన్ అజేయ రికార్డుతో ఎలైట్‌లో ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో.. తాజాగా ఉత్తరాఖాండ్ చేతిలో 78 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 269 పరుగుల ఛేదనలో హైదరాబాద్ 190 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ రాయుడు
(47, 152 బంతుల్లో 4 ఫోర్లు), తన్మరు అగర్వాల్ (38, 55 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), అభిరాత్ రెడ్డి (35, 45 బంతుల్లో 5 ఫోర్లు) మెరిసినా.. ఛేదనలో హైదరాబాద్ చతికిల పడింది. కెప్టెన్ రాహుల్ సింగ్ (0), హిమతేజ (22), రాహుల్ (12), తనరు త్యాగరాజన్ (2), సివి మిలింద్ (5), అనికెత్ రెడ్డి (2)లు విఫలమ య్యారు. ఉత్తరాఖాండ్ బౌలర్ స్వప్నిల్ సింగ్ (6/59) ఆరు వికెట్లతో హైదరాబాద్ ఖేల్ ఖతం చేశాడు. ఎలైట్ గ్రూప్-బిలో తదుపరి మ్యాచ్‌లో ఈ నెల 26 నుంచి పుదుచ్చేరితో హైదరాబాద్ తలపడనుంది.