ఓటమి నం.8

ఓటమి నం.8– నిరాశపరిచిన
– హాకీ అమ్మాయిలు
లండన్‌ (ఇంగ్లాండ్‌) : ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రో లీగ్‌లో హాకీ ఇండియా అమ్మాయిలు దారుణంగా నిరాశపరిచారు. గ్రేట్‌ బ్రిటన్‌తో మ్యాచ్‌లో 2-3తో పరాజయం పాలయ్యారు. లాల్‌రెమి సియామి, నవనీత్‌ కౌర్‌లు 14, 23వ నిమిషాల్లో గోల్స్‌తో భారత్‌ను 2-1తో ముందంజలో నిలిపారు. గ్రేస్‌ బాల్డ్‌సన్‌ 56, 58వ నిమనిషాల్లో గోల్స్‌తో గ్రేట్‌ బ్రిటన్‌కు 3-2తో విజయాన్ని అందించింది. ప్రొ లీగ్‌లో ఎనిమిదో పరాజయంతో భారత అమ్మాయిలు ఇంటిబాట పట్టారు.