బీజేపీ నీ ఓడించడమే మునీర్ అహ్మద్ కు నిజమైన నివాళి

నవతెలంగాణ-  కంటేశ్వర్
సీపీఐ(ఎం) పార్టీ నగర కమిటీ సభ్యుడు ముని రైమత్ సంతాప సభను నగరంలోని బహుజన కాలనీలో నిర్వహించటం జరిగింది. సంతాప సభకు హాజరైన సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తి మున్నీరైమాదని ఇల్లు లేని నిరుపేదల కోసం బహుజన కాలనీలో ఇండ్ల స్థలాల పోరాటం  నిర్వహించటంలో కీలక పాత్ర పోషించిన ముని రైమ కరోనా కాలంలో కూడా కాలనీవాసులకు సరుకులను ఆహార పదార్థాలను అందించారని మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడారని జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలకు బీజీపీ అనేక హామీలు ఇచ్చి వాటిని అమలుజారి పట్టణంలో విఫలమవడంతో ఎన్నికల్లో బీజీపీని ఓడించాలని ఆయన ఆలోచించారని ప్రధానంగా పేదలకు పది అవకాశాలను కల్పించడంలో కానీ అవినీతి సొమ్మును రాబట్టడంలో కానీ ఉద్యోగాలను ఇవ్వటంలో కానీ విఫలమయ్యారని ప్రజా సమస్యలపై పోరాడే వారిపైన మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ స్వలాభం కోసం తున్న బీజీపీని ఓడించటం ద్వారా మాత్రమే ముని రాయ్ మధు ఆశయం కోసం పని చేసిన వారమవుతామని ఆయన అన్నారు. ఈ సంతాప సభలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఈ సూరి జిల్లా కమిటీ సభ్యురాలు సుజాత నాయకులు విగ్నేష్, మహేష్ తదితరులతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.