ఓటమి గెలుపుకు నాంది పలకాలి..

Defeat should be the beginning of victory..– 68 వ ఎస్ జి ఎఫ్ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ప్రతి క్రీడ పోటీలో ఓటమి గెలుపుకు నాంది పలకాలని ఆటలో మంచి ప్రతిభను కనబరిచన జట్టే గెలుపు పొందుతుందని ఓడిన వారు నిరాశ నిసృహాలకు లోను కాకుండా మున్ముందు మంచి ఆట తీరును ప్రదర్శించి గెలిపియంగా బదిలోకి దిగాలని తహసిల్దార్ వెంకట్ రావు, ఎంపీడీవో లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 68 వ ఎస్ జి ఎఫ్ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ను తహసిల్దార్ వెంకట్ రావు, ఎంపిడిఓ లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి టోర్నమెంట్లో జట్టులో ఉన్న సభ్యుల ఆట తీరుపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయని గెలిచిన ఓడిన ఆట తీరును మెరుగు పరుచుకుంటూ ఉండాలని సూచించారు అంతకుముందు జిల్లాలోని ఆయ మండలాలలోని అయా గ్రామాలకు చెందిన క్రీడాకారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించి క్రీడలను ప్రారంభించారు.14 ఏళ్ల నుండి 15 ఏళ్ల లోపు బాల బాలికలకు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం పి ఓ రాజ్ కాంత్ రావు, మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్, పిఈటిలు, వ్యాయామ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, క్రీడాకారులు విద్యార్థులు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.