మతోన్మాద బీజేపీని ఓడించండి: దుగ్గి చిరంజీవి

– సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి

– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దుగ్గి చిరంజీవి
– మండలంలో విస్తృత ప్రచారం
నవతెలంగాణ – తాడ్వాయి
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించి, సీపీఐ(ఎం) బలపరిచిన మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారిని గెలిపించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దుగ్గి చిరంజీవి అన్నారు. శుక్రవారం మండలంలోని ఊరట్టం కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయకులు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా సీపీఐ(ఎం) శ్రేణులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ ఈ దేశాన్ని సర్వనాసం చేసిందని దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసిందని ధ్వజమెత్తారు. రాజ్యాంగ హక్కులను పూర్తిగా కాలరాసిందని దళితుల మీద దాడులు, మైనార్టీల మీద దాడులు, మహిళలపై దాడులు, ఇలా అనేక రకాలుగా తను మనువాద సిద్ధాంతంతో పరిపాలన కొనసాగించిందని అన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని లౌకిక తత్వాన్ని పొందించాలన్న ఆలోచనతో ప్రజలకు మెరుగైన పాలన అందించాలని ఇండియా కూటమి ఏర్పడిందని, ఇండియా కూటమికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి ఇండియా కూటమి భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారిని అత్యధిక ఓట్లు మెజారిటీతో గెలిపించాలని కోరారు. మండలంలోని పార్టీ శాఖలు ఉన్న గ్రామాల్లో కూడా విస్తృతంగా కూటమి అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి చిరంజీవి, అశోక్, దాసరి కృష్ణ సీపీఐ(ఎం) పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.