మతోన్మాద బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించండి: మల్లు లక్ష్మి

నవతెలంగాణ – నూతనకల్
పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి  పిలుపునిచ్చారు.గురువారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార రథాలను ఆమె జెండా ఊపి ప్రారంభించి అనంతరం  చిల్పకుంట్ల,ఎడవెల్లి, వెంకేపల్లి గ్రామాలలో  ఇంటింటికి ప్రచారాన్ని  ఆమె ప్రారంభించి మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఎండి జహంగీర్  గెలుపు ద్వారానే సాధ్యం అవుతుందన్నారు. బీజేపీ గత పది సంవత్సరాల కాలంలో ప్రజలు చెమటోర్చి సంపాదించిన డబ్బును జిఎస్టి పేరుతో పన్నుల రూపం లో వచ్చిన సంపదను కొద్ది మంది పెట్టుబడుదారులకు కట్టబెడుతూ బడా పెట్టుబడిదారులకు వేలకోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు రద్దు చేశారని, ప్రభుత్వ రంగానికి  సంబంధించిన సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని, ప్రైవేటీకరణ లో రిజర్వేషన్లు రద్దు అవుతాయని కింది స్థాయి ప్రజలకు ఉద్యోగ అవకాశాల్లేకుండా పోతాయని అన్నారు. పార్లమెంట్ లో 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చి ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉందని, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతు పార్లమెంట్లో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని, స్వాతంత్ర సమరయోధులకు ఇతర వ్యక్తులకు మతం రంగు పుస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్నారు. దేశంలో నిరుద్యోగము, అధిక ధరలు పెరిగిపోయాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులుపులుసు సత్యం, వేల్పుల వెంకన్న, జిల్లా పల్లి నరసింహారావు, కొప్పుల రజిత మండల కమిటీ సభ్యులు బొజ్జ శ్రీను, తోట్ల లింగయ్య, నాయకులుగజబెల్లి శ్రీనివాస్ రెడ్డి, జటంగి లింగయ్య, ఎర్ర ఉప్పల్ రెడ్డి, పులసరివెంకట ముత్యంతదితరులు పాల్గొన్నారు.