బీజేపీని ఓడించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి

– దళిత్‌ సమ్మిట్‌ సిద్దిపేట రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్‌
భారత రాజ్యాంగ స్థానంలో మను అధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తున్న బీజేపీని తిరిగి అధికారంలో రాకుండా ఓడించడం ద్వారానే రాజ్యాంగాన్ని కాపాడుకోగలమని, అట్టడుగు వర్గాలైన దళితుల్లో చైతన్యం కల్పించడం కోసం ప్రజా సంఘాలు సమాజ సంఘాల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ రాష్ట్రవ్యాప్తంగా చేయాలని దళిత్‌ సమ్మిట్‌ రాష్ట్ర నేతలు కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి టి స్కైలాబ్‌ బాబు డిబిఎఫ్‌ జాతీయ కార్యదర్శి పి.శంకర్‌,లు పిలుపునిచ్చారు. దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ అధ్యక్షతన సిద్దిపేట గురువారెడ్డి భవన్‌లో శనివారం దళిత సమ్మిట్‌ జిల్లా రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్కైలాబ్‌ బాబు, శంకర్‌ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద పెద్ద ఎత్తున దాడులు దౌర్జన్యాలు పెరిగాయన్నారు. బాధితులకు రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వం దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్న పెత్తందారులకు కొమ్ముకాస్తుందని మండిపడ్డారు. భారత రాజ్యాంగ హక్కులను అమలు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధపడటం లేదని.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని, కార్పొరేట్‌ బహుళజాతి కంపెనీల ఒత్తిడికి తల్లోగ్గి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ప్రభుత్వ రంగ పెట్టుబడిలను ఉపసంహరించుకోవడం చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలు చేయడం లేదన్నారు. విస్తారమైన ప్రైవేట్‌ రంగంలో ఉపాధిలో రిజర్వేషన్ల అమలు చేయకపోవడం వలన ఉన్నత విద్య చదివిన దళిత విద్యార్థులు ఉపాధిక దూరం అవుతున్నారని అన్నారు. అభివద్ధి పేరుతో జరుగుతున్న భూసేకరణలో దళితుల చేతుల్లో ఉన్న అసైన్మెంట్‌ భూములన్ని కేంద్రీకరించి లాక్కుంటున్నారని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పెత్తందారుల ఒత్తిడి వలన ఉపాధి పనికి నిధులు తగ్గించి పనిని ఎత్తేయాలని కుట్ర చేస్తుందన్నారు. పట్టణాలలో ఉపాధి పని పెట్టాలని చేస్తున్న డిమాండ్‌ ను పట్టించుకోవడం లేదని, తెలంగాణలో దళితులకు మూడు ఎకరాల భూమి పంచుతామని ప్రభుత్వం చేతులెత్తేసిందని.. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధపడటం లేదన్నారు. అంటరానితనం కుల వివక్షను పాలకులే పెంచి పోషిస్తున్నారని.. ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధపడటం లేదన్నారు. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సులు మంత్రి కోనేరు రంగారావు కమిటీ భూ సిఫార్సులను అమలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడలేదన్నారు. దళితుల సమస్యలను ఎన్నికల ఏజెండాలలో చేర్చి వాటి పరిష్కారానికి కషి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాళ్లబండి శశిధర్‌ కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షులు బక్కెళ్లి బాలకిషన్‌ జిల్లా నాయకులు రమేష్‌ ఎల్లయ్య యాదగిరి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు రాం సాగర్‌ సర్పంచ్‌ తాడూరి రవీందర్‌ బి శ్రీనివాస్‌ బాల కిషన్‌ డిబిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామి, రాష్ర ఉపాధ్యక్షడు దుబాషి సంజివ్‌,జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు,జిల్లా ఉపాధ్యక్షుడు భీమ్‌ శేఖర్‌, డిహెచ్పిఎస్‌ జిల్లా అధ్యక్షుడు రామగల్ల నరేష్‌ సీఐటీయూ జిల్లా కార్యదర్శి చొప్పరి రవికుమార్‌ ఎస్‌ ఎఫ్‌ ఐ జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్‌,వివిధ సంఘాల నాయకులు రవి కుమార్‌, శంకర్‌, బన్సిలాల్‌ తది తరులు పాల్గొ న్నారు.