పార్టీలు మార్చే వారిని, మతోన్మాదులను ఓడించండి

Defeat defectors and fanatics– సీపీఐ(ఎం) జాతీయ నాయకులు సాయిబాబు … ఆశ్వారావుపేట అభ్యర్థి పిట్టల అర్జున్‌రావు నామినేషన్‌
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్నికల్లో గెలవడానికి ఒక పార్టీ, అధికారం చెలాయిం చేందుకు మరో పార్టీ మార్చే నాయకులను, మతం పేరుతో, ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్న రాజకీయ పార్టీల అభ్యర్థులను ఓడించి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే కమ్యూనిస్టులను గెలిపించాలని సీపీఐ(ఎం) జాతీయ నాయకులు ఎం.సాయిబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. అశ్వారావుపేట సీపీఐ(ఎం) అభ్యర్థి పిట్టల అర్జున్‌ రావు గురువారం నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, నియోజకవర్గ ఎన్నికల కన్వీనర్‌ కొక్కెరపాటి పుల్లయ్య అధ్యక్షతన జరిగిన సభలో సాయిబాబు మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో అధికారం చేపట్టిన కేసీఆర్‌ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మధ్యనే ఉండే సీపీఐ(ఎం)ను గెలిచించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య తదితరులు పాల్గొన్నారు.