అవకాశవాద రాజకీయ పార్టీలను ఓడించండి: జూలకంటి రంగారెడ్డి

నవతెలంగాణ – వలిగొండ రూరల్
ఎన్నికలోచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కినాక ప్రజలను పట్టించుకోని అవకాశవాద రాజకీయ పార్టీలను భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి నిరంతరం ప్రజల కోసం పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం రాత్రి మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో సీపీఐ(ఎం) నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో అవకాశవాద రాజకీయాలు చేస్తున్న రాజకీయ పార్టీలను ఓడించి నిరంతరం ప్రజల కోసం పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించడం ద్వారా భువనగిరి పార్లమెంటు అభివృద్ధి జరుగుతుందని మే 13న జరిగే ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. దేశంలో గత పది సంవత్సరాల క్రితం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం విపరీతమైన ధరలను పెంచి సామాన్యులను, మధ్యతరగతి, పేద ప్రజలను నిలువ దోపిడీ చేస్తుందన్నారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగాన్ని లేకుండా చేయడం కోసం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రగల్బాలు పలికి, గత ప్రభుత్వాలు కల్పించిన అనేక ప్రజా పోరాటాల ద్వారా సాధించిన ఉద్యోగాలను తొలగించిందన్నారు. మరొక పక్క స్వాతంత్ర్యం సాధించిన నాటి నుండి నేటి వరకు అనేక పోరాటాల ద్వారా వచ్చిన ప్రభుత్వ రంగ పరిశ్రమలను దివాలా తీయించి కార్పొరేట్ అధిపతులను అందలం ఎక్కించే విధంగా వ్యవహరించి వాటిని కారు చౌకగా కార్పొరేట్లకు అమ్మేస్తుందన్నారు. ఒకవైపు కులాల పేరుతో మతాల పేరుతో ప్రజల మధ్యన విద్వేషాలు సృష్టిస్తూ మరొకవైపున భారత రాజ్యాంగాన్ని ఈసారి అధికారంలోకి వస్తే సమూలంగా మారుస్తామంటూ రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని కూలదోయాల్సిన అవసరం ప్రజలకు ఉందని బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.
భువనగిరి పార్లమెంట్ పరిధిలో సీపీఐ(ఎం) అనేక ప్రజా పోరాటాలను నిర్వహించిందని ఆ పోరాటాలన్నింటికీ నాయకత్వం వహించి నేడు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎండి జహంగీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి బుగ్గ చంద్రమౌళి అధ్యక్షత వహించగా ఈ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు,  మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, సీనియర్ నాయకులు పులిగిల్ల మాజీ సర్పంచ్ కొమ్మిడి లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు కళ్లెం సుదర్శన్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు వాకిటి వెంకటరెడ్డి, శాఖ సహాయ కార్యదర్శి మారబోయిన నరసింహ, మాజీ ఎంపీటీసీ బుగ్గ ఐలయ్య, మాజీ సర్పంచ్ బుగ్గ దేవమ్మ, సీనియర్ నాయకులు దొడ్డి బిక్షపతి, వరికుప్పల యాదయ్య, వడ్డెమాని వెంకటయ్య, వేముల చంద్రయ్య, వరికుప్పల శంకరయ్య, నాయకులు వేముల అమరేందర్, వరికుప్పల, మల్లేశం వడ్లకొండ శంకరయ్య, దొడ్డి యాదగిరి, కొమ్మిడి రఘునాథ్ రెడ్డి, ఈర్ల రమేష్, వేముల ఆనంద్, కొమ్మిడి కృష్ణారెడ్డి, వేముల ముత్తయ్య, కళ్లెం రఘుపతి రెడ్డి, మారబోయిన ముత్యాలు, బొడ్డు రాములు, వేముల నాగరాజు, వేముల యేసయ్య, వడ్డెమాని మధు, వరికుప్పల సతీష్, నరసింహ, వడ్డెమాని రవి, వేముల జ్యోతిబస్, బుగ్గ ఉదయ్ కిరణ్, వేముల మల్లేశం, సందెల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.