9న ప్రగతి భవన్ ముట్టడిని జయప్రదం చేయండి..

నవతెలంగాణ – మునుగోడు
గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో గొర్రెల మేకల పెంపకందారుల పలు సమస్యలను పరిష్కరించాలని ఈనెల 9న ప్రగతి భవన్ ముట్టడిని జయప్రదం చేసేందుకు వేలాదిగా తరలిరావాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షులు సాగర్ల మల్లేష్ కోరారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశమైన మాట్లాడుతూ వృత్తిదారుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన ప్రభుత్వాలు నిధులు కేటాయించకుండా వృత్తిదారులను కాపాడుకోవడంలో ప్రభుత్వాలు విఫలమైన మండిపడ్డారు. గొర్రెల మేకల పెంపకందారులను ఆదుకునేందుకు గొర్ల కోసం డిడి తీసిన లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న గొర్ల యూనిట్లను లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు.