అభివృద్ధిని విస్మరించిన వారిని ఓడించండి

– పేదలకు సొంతింటి కల.. కలగానే మిగిలిపోయింది
– సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్‌
నల్గొండ పట్టణంలో 2013లో విలీనమైన ఏడు గ్రామపంచాయతీల అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించాలని సీపీఐ(ఎం) నల్గొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి కోరారు. ఆదివారం చర్లపల్లిలోని సప్తగిరి విలాస్‌ సాయి ద్వారకా, సాయి బాలాజీ, సాయి సదన్‌ తదితర గేటెడ్‌ కాలనీలలో ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల క్రితం నల్లగొండ మున్సిపాలిటీలో విలీనమైన ఏడు గ్రామాలను పట్టణీకరణ చేయడంలో బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ విఫలమయ్యారని ఆరోపించారు. వేలాదిమంది పేదలు ఇంటి స్థలాలు లేక సొంత ఇంటి నిర్మాణం కలగానే మిగిలిపోయిందని అన్నారు. చర్లపల్లిలో అద్దంకి బైపాస్‌ వెంట సర్వీసు రోడ్డు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పట్టణ ప్రజల అవసరాలను తీర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతూ ప్రతిపక్ష పాత్ర కమ్యూనిస్టులు పోషిస్తారని ప్రజలందరూ ఆదరించి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి నన్ను గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్‌ హశం, పట్టణ కార్యదర్శి ఎండి సలీమ్‌, సీనియర్‌ నాయకులు ఊట్కూరి నారాయణరెడ్డి ,జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, పుచ్చకాయల నర్సిరెడ్డి, కుంభం కష్ణారెడ్డి, పట్టణ కమిటీ సభ్యులు పిన్నపురెడ్డి మధుసూదన్‌ రెడ్డి, దండెంపల్లి సరోజ, భూతం అరుణ, కాసర్ల గౌతంరెడ్డి, కోట్ల అశోక్‌ రెడ్డి, గౌరీదేవి మధు, జంజరాల సైదులు, మల్లయ్య, కాసర్ల సాత్విక్‌ పాల్గొన్నారు.