– భారత్-ఏ బ్యాటర్ల ఘోర వైఫల్యం
మెల్‌బోర్న్: భారత్-ఏ బ్యాటర్ల ప్రదర్శన ఏమాత్రం మెరుగవ్వలేదు. ఆసీస్-ఏతో రెండో అనధికార టెస్టులోనూ విఫలమైన మనోళ్లు 0-2తో సిరీస్‌ను వైట్‌వాష్ చేసుకున్నారు. 168 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్-ఏ 47.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శామ్ (73 నాటౌట్, 128 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), వెబ్‌స్టర్ (46 నాటౌట్, 66 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు. దీంతో ప్రసిద్ కష్ణ (2/37) ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ఒత్తిడి పెంచినా ఫలితం లేకపోయింది. అంతకుముందు భారత్-ఏ రెండో ఇన్నింగ్స్‌లో 77.5 ఓవర్లలో 229 పరుగులకు కుప్పకూలింది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (68, 122 బంతుల్లో 5 ఫోర్లు), తనుశ్ కొటియన్ (44, 84 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (38) రాణించారు. కెఎల్ రాహుల్ (10), అభిమన్యు (17), సాయి సుదర్శన్ (3), రుతురాజ్ గైక్వాడ్ (11), దేవదత్ పడిక్కల్ (1) విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్-ఏ 161 పరుగులు చేయగా.. ఆసీస్-ఏ 223 పరుగులు చేసింది.