పట్టాల్లో లోపాలే కారణం

–  బీహార్‌ రైలు ప్రమాదంపై ప్రాథమిక విచారణ నివేదిక
పాట్నా : బీహార్‌లో జరిగిన రైలు ప్రమాదానికి పట్టాల్లో లోపాలే కారణమని ప్రాథమిక విచారణ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికపై రైలు డ్రైవర్‌తో సహా ఆరుగురు రైల్వే అధికారులు సంతకం చేశారు. బక్సర్‌ జిల్లాలో నార్త్‌ఈస్ట్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు కోచ్‌లు పట్టాలు తప్పిన ప్రమాదంలో నలుగురు ప్రయాణీకులు మృతి చెందగా, 50 మందికి గాయపడ్డారు. మృతుల్ని ఉషా భండారి (33), ఆమె కుమార్తె అకృతి భండారి (8), అబు జైద్‌ (68), నరేంద్ర (70)గా గుర్తించారు. ఢిల్లీలోని ఆనంద్‌ విహర్‌ టెర్మినల్‌ నుంచి బుధవారం రాత్రి 7:30 గంటలకు ఈ రైలు బయలుదేరింది. అస్సాంలోని తిన్షుకియాకు (గౌహతి) వెళ్లాస్సి ఉండగా.. రఘునాథ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌కు సమీపంలో రాత్రి 9:53 గంటల సమయంలో ప్రమాదానికి గురయింది.