
రెంజల్ మండలం తాడు బిలోలి అంబేద్కర్ విగ్రహం ఎదుట భారత రాజ్యాంగ రక్షణ పోస్టర్లను స్థానిక నాయకులు ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు అందించిన సేవలు అమోఘమని వారి సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు క్రాంతికుమార్, పార్వతి రాజేశ్వర్, గంగాధర్, పోశెట్టి, జంగం గంగయ్య, నరేష్, యోహాన్, నాగయ్య, ముత్యం నరేష్, గైని శ్రీనివాస్, జై .సంతోష్, బ్యాగరి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.