– కేంద్ర రక్షణ శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తిలో రికార్డు స్థాయి వృద్ధి నమోదైందని రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2023-24లో ప్రభుత్వ అనుబంధ రక్షణ సంస్థలు (డిపిఎస్‌యుఎస్), పిఎస్‌యుఎస్, ప్రైవేట్ రంగ రక్షణ సంస్థల్లో మొత్తంగా రూ.1,26,887 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులు నమోదైనట్లు తెలిపింది. గతంతో పోలిస్తే ఇది 16.7 శాతం అధికమని పేర్కొంది. ఇందులో ప్రైవేట్ సెక్టార్‌లో 20.8 శాతం ఉత్పత్తి జరిగినట్లు తెలిపింది. రక్షణ ఉత్పత్తి వృద్ధికి ఎగుమతులు కూడా దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తులు రికార్డు స్థాయిలో రూ.21,083 కోట్లకు చేరుకున్నాయని తెలిపింది. గతేడాది పోలిస్తే 32.5 శాతం వృద్ధి నమోదయిందని తెలిపింది.