ఉపాధి ఆడిట్‌ విధానంలో లోపం

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్‌
– అడిషనల్‌ పీడీకి వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఉపాధిహమీ పనులపై నిర్వహిస్తున్న ఆడిట్‌ విధానం సరికాదన్నారు. కేవలం ఉపాధిహామీ కూలీలు చేసిన పనులపైనే ఆడిట్‌ చేసి, పీఆర్‌, ఫారెస్టు శాఖలు చేసిన పనులపై ఎందుకు ఆడిట్‌ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు మండల ఓపెన్‌ఫోర్‌లో అధికారులను నిలదీశారు. ఫారెస్టు, పీఆర్‌ శాఖలు చేసిన పనులపై ఆడిట్‌ నిర్వహించి సభ నిర్వహించాలని అడిషనల్‌ పీడీ నీరజకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మండల పరిధిలో ప్రతి గ్రామంలో జరిగిన పనుల్లో అవకతవకలు జరిగాయన్నారు. కూలీలకు డబ్బులు రావడం లేదన్నారు. కానీ కాంట్రాక్టర్లు చేసిన పనులకు మాత్రం బిల్లులు ఇచ్చారన్నారు. కానీ వారి పనులపై ఆడిట్‌ చేయకండా, కూలీలు పనులపైనే ఎలా ఆడిట్‌ చేస్తారని ప్రశ్నించారు. సుమారు 3కోట్లపైగా నిధులు ఖర్చు చేసినా ఆడిట్‌ చేయకపోవడం దారుణమన్నారు. తాత్కాలికంగా సభను నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్‌ జంగయ్య, పి జంగయ్య, మండల అధ్యక్ష, కార్యదర్శులు కాకి రమేష్‌, గణేష్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జగన్‌, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ప్రకాష్‌ కరత్‌, యాదగిరి, టీ.యాదగిరి, ఎన్‌ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.