కచ్చితంగా ఈ టెస్టులు చేయించుకోవాలి…

Definitely get these tests done...ఎంత ఆరోగ్యంగా ఉన్నా రెగ్యులర్‌ హెల్త్‌ చెకప్‌ చేయించుకోవడం ముఖ్యం. వీటి కారణంగా ఫ్యూచర్‌లో ఎలాంటి సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఉదాహారణకి.. మీకు బీపి ఉందో లేదో తెలుసుకోవడానికి రెగ్యులర్‌గా చెకప్‌ చేసుకోవాలి. దీని వల్ల షుగల్‌ లెవల్స్‌ పెరగడం, కొలెస్ట్రాల్‌ పెరగడం వంటి సమస్యల్ని మొదట్లోనే గుర్తించొచ్చు. మొదట్లో ఎలాంటి లక్షణాలను కనిపించవు. అయితే, సాధారణ రక్త పరీక్ష ద్వారా దీనిని గుర్తించొచ్చు. ముఖ్యంగా ఆడవారు కొన్ని టెస్టులు చేయించుకోవాలి.
కొలొరెక్టల్‌ క్యాన్సర్‌..
40 ఏళ్ళ తర్వాత, కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ని గుర్తించటానికి రెగ్యులర్‌గా చెకప్‌ చేయించుకోవాలి. ఇందులో సిగ్మోయిడోస్కోపీ, కోలనోస్కోపీ టెస్టులు ఉంటాయి. మీకు ఇన్‌ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి, పాలిప్స్‌ చరిత్ర వంటి ప్రమాద కారకాలు ఉంటే స్క్రీనింగ్‌ చేయించుకోవాలి.
బీపి, కొలెస్ట్రాల్‌ టెస్ట్‌..
గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి బీపి, కొలెస్ట్రాల్‌ టెస్టులు చేయించుకోవాలి. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించేందుకు కొలెస్ట్రాల్‌ టెస్టు చేయాలి.
బోన్‌ డెన్సిటీ టెస్ట్‌..
దీనినే ఎముక సాంద్రత స్కాన్‌, DEXA స్కాన్‌ అని కూడా చెబుతారు. ఇది ఎముకలలోని కాల్షియం, ఇతర ఖనిజాల గురించి తెలుసుకునే ఎక్స్‌రే టెస్ట్‌. దీని ద్వారా ఎముకల బలం, మందాన్ని తెలుసుకోవడానికి సాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో బలం తగ్గుతుంది. 30 నుంచి 40 ఏళ్ళలోపు ఆడవారు బోన్‌ డెన్సిటీ టెస్ట్‌ చేయించుకోవాలి. దీని వల్ల బోలు ఎముకల సమస్య ప్రమాదం తగ్గుతుంది.
డయాబెటీస్‌ టెస్ట్‌..
డయాబెటీస్‌ స్క్రీనింగ్‌ ముఖ్యం. ఎందుకంటే, అధికబరువు, షుగర్‌ వచ్చే ప్రమాదం వయసుతో పాటు పెరుగుతుంది. 35 ఏళ్ళ వయసులో డయాబెటీస్‌ టెస్ట్‌ చేయించుకోవాలి. ఆ తర్వాత 3 సంవత్సరాలకి చేయించుకోవాలి. మీకు డయాబెటిస్‌కి ఇతర ప్రమాద కారకాలు ఉంటే స్క్రీనింగ్‌ ముందుగానే చేసుకోవాలి. అధికబరువు ఉంటే, అధిక రక్తపోటు, ప్రీడయాబెటీస్‌, గుండె జబ్బుల చరిత్ర ఉంటుంది. మీరు ప్రెగెంట్‌ కావాలనుకుంటే అధికబరువు, హైబీపి, ఇతర ప్రమాద కారకాలు ఉన్నట్లైతే డయాబెటిస్‌ స్క్రీనింగ్‌ ముందుగానే చెక్‌ చేయాలి.
బ్రెస్ట్‌ క్యాన్సర్‌ టెస్ట్‌..
40 సంవత్సరాల వయసు నుండి ఆడవారు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ టెస్ట్‌ చేయించుకోవాలి. ప్రతి సంవత్సరం, రెండు సంవత్సరాలకి ఓ సారి మామోగ్రామ్‌ చేయించుకోవాలి. వారి కుటుంబంలో ఇప్పటికే క్యాన్సర్‌ ఉంటే వారు ముందునుంచీ జాగ్రత్తగా ఉండాలి. 30 ఏళ్ళు పైబడిన వారు 3, 4 నెలలకోసారి బ్రెస్ట్‌ సెల్ఫ్‌ టెస్ట్‌ చేయించుకోవాలి. స్త్రీ గైనకాలజిస్ట్‌తో బ్రెస్ట్‌ టెస్ట్‌ 20 నుంచి 35 సంవత్సరాల మధ్య ప్రతి 3 సంవత్సరాలకి, 35 తర్వాత సంవత్సరానికి ఓ సారి చెక్‌ చేసుకోవాలి.