
నవతెలంగాణ-మద్నూర్ : జిల్లా కేంద్రానికి వెళ్లడానికి మద్నూర్ మండల ప్రజలకు సరైన సమయంలో బస్సును కామారెడ్డి డిపో అధికారులు ప్రారంభించడం ఈ బస్సు సౌకర్యం ఈ మండల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రయాణికులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు జిల్లా కేంద్రం కామారెడ్డి నుంచి వయా తాడ్వాయి, లింగంపేట్, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, పిట్లం, పెద్ద కొడప్ గల్, బిచ్కుంద, మద్నూర్ మీదుగా మహారాష్ట్ర దేగ్లూర్ వరకు కొత్తగా కామారెడ్డి డిపో బస్సు ప్రారంభించామని కామారెడ్డి డిపో అసిస్టెంట్ మేనేజర్ మూర్తి తెలిపారు. కామారెడ్డి నుంచి ఉదయం 11:00 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు దేగ్లూర్ చేరుకుంటుంది. తిరిగి 3 గంటలకు దేగ్లూర్ నుంచి ప్రారంభమై 6.30 కి కామారెడ్డి చేరుకుంటుంది. కామారెడ్డి నుంచి సాయంత్రం 6.30 గంటలకు మళ్లీ బయలుదేరి దేగ్లూర్ లో నైట్ హల్ట్ ఉండి. ఉదయం 6 గంటలకు బయలుదేరి 9:30 కి కామారెడ్డి చేరుకుంటుందని ఆయన అన్నారు.