
పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ ఆన్స్ కామర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు శుక్రవారం జిల్లా గ్రంథాలయంను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, వివిధ భాషలకు చెందిన పుస్తకాలను, జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు, దేశ నాయకుల చరిత్రల పుస్తకాలను చూపించారు. పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుందని, ప్రతినిత్యం పుస్తకాలు చదువుతు ఉండలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రఘు గణపతి, తెలుగు విభాగం అధ్యాపకులు కె.రేఖ, నరేష్, ఇంగ్లీష్ విభాగం అధ్యాపకులు, అనిత, సంతోషిని, హిందీ విభాగం అధ్యాపకులు పూనం, జిల్లా గ్రంథాలయ అధికారులు సతీష్, కిరణ్, విద్యార్థులు పాల్గొన్నారు.