అర్హులైన పేదలకు పట్టాలు ఇవ్వాలి

నవతెలంగాణ – గోవిందరావుపేట
అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ కార్తిక సంఘం జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రం లో మండల తాసిల్దార్ ఆఫీస్ ముందు మండల వ్యాప్తంగా ఉన్న పేదలంతా ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి బి రెడ్డి సాంబశివ మాట్లాడుతూ జీవో 58 ప్రకారం అర్హులైన పేదలకు పట్టాలు ఇచ్చి గృహ నిర్మాణం కోసం 10 లక్షలు ఇవ్వాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఐదు లక్షలు కేటాయించి డబల్ బెడ్ రూమ్ నిర్మాణం చేస్తేనే ఐదు లక్షల సరిపోలేదని ఇప్పుడు మూడు లక్షలు నిర్మాణం కోసం ఇస్తే ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. అదేవిధంగా పెద ప్రజలకు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చి గృహ నిర్మాణం ఖర్చులు 10 లక్షలు ఇవ్వాలని ఆయన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలనందరిని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఆయన ఈ ప్రభుత్వాలనే హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్ఐ రాజేందర్ కు అందించారు. డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకువెళతానని రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తీగల ఆగిరెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పొదిళ్ల చిట్టిబాబు ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు గొంది రాజేష్ కొట్టెం కృష్ణారావులు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బి సంజీవ ఐద్వ మహిళా సంఘం నాయకులు రాజేశ్వరి కవిత సిరిబలి జీవన్ పిట్టల అరుణ్ మాదాసి శ్రావణ్ అరవింద్ తదితరులు 800 మంది మండల వ్యాప్తంగా పేదలు పాల్గొన్నారు.