సెప్టెంబర్‌ 18 నుంచి డీఈఐఈడీ

– ద్వితీయ సంవత్సరం పరీక్షలు
– టైం టేబుల్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఐఈడీ) ద్వితీయ సంవత్సరం చదువుతున్న (2022-2024 బ్యాచ్‌) విద్యార్థులకు వచ్చేనెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు గురువారం టైంటేబుల్‌ను విడుదల చేశారు. అదేనెల 24 వరకు ఆ పరీక్షలు జరుగుతాయని వివరించారు. ప్రతిరోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. వచ్చేనెల 18న పేపర్‌-1, 19న పేపర్‌-2, 20న పేపర్‌-3, 21న పేపర్‌-4, 23న పేపర్‌-5, 24న పేపర్‌-6 పరీక్షలుంటాయని పేర్కొన్నారు. పాత బ్యాచుల్లో ఫెయిలైన విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు హాజరు కావాలని కోరారు.